R1

http://kerala.finance.blog/2022/05/27/j1/

Nehemiah 1: 5
And said, I beseech thee, O LORD God of heaven, the great and terrible God, that keepeth covenant and mercy for them that love him and observe his commandments: Amen!!

PRESSLINK:

https://youtu.be/Akk217-m2Rc

జీవిత సత్యాలు……!!

జీవితం లో గెలవడానికి జాలి, దయ,

మంచితనం మాత్రమే ఉంటే

చాలదు….

కర్ణుడు అంటేనే మంచితనానికి,

దాన, ధర్మలకి

పెట్టింది పేరు

కానీ సమయాన్ని బట్టి నడుచుకోక

పోవడం వలన

చెడు (కౌరవుల వైపు నిలబడి
ప్రాణాలని పోగొట్టుకున్నాడు,
కావున జీవితం లో గెలవాలంటే. మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి….. చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు…. శకుని.. పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి, వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి వారు జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు, అలాంటి వారి చెడు సలహాలని

దూరం పెట్టాలి…

ఎటువంటి బేధాలు చూడని నిజమైన.

స్నేహం

జీవితంలో ఉన్నత స్థానానికి

తీసుకెళ్తుంది……

పాండవులు శ్రీ కృష్ణుడుని, కౌరవులు

కర్ణుడుని పొందటం అది వారికి

యుద్ధం సమయంలో ఏ స్థాయిలో

ఉపయోగపడిందో తెలిసినదే,

కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో,

కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి

ధైర్యమే తెలిసిన

సంగతే కదా, కుల, మత, పేద

మరియు ధనిక భేదాలని చూడకుండా

మంచివారితో స్నేహం చేసేవారు

ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు…

అధికం అనేది అత్యంత

ప్రమాదకరం…….

కరవుల తల్లి అయిన గాంధారీకి

వంద మంది కుమారులు ఉండటం

వల్ల వారిని పెంచటంలో చాలా

కష్టపడాల్సి వచ్చింది,

రాజ్యాన్ని బిడ్డలకి సమంగా

పంచటమూ వారి బాగోగులు చూస్తూ

క్రమశిక్షణతో పెంచటమూ కూడా

చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి

ఉన్న అధికమైన కోపం,

అధికమైన రాజ్యకాంక్ష కారణంగా

కౌరవులు నాశనం అయ్యారు..!

కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు

పక్షాన అధిక

అనేది అత్యంత ప్రమాదకరం….

ఎవరి పనులు వారే చేసుకోవడం….

అరణ్య వాసం, అజ్ఞాతవాసంలో

ఉన్న పాండవులకి

వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట

పనులు చాలా ఉపయోగపడ్డాయి,

అలాగే మనకి కూడా మన అవసరాల

కోసం అయిన

కొన్ని పనులు నేర్చుకోవాలి …

మనకి సంభందించిన దాని కోసం

ఎంత కష్టమైన పోరాడాలి….

కౌరవులతో పోల్చుకుంటే పాండవుల

సైన్యం

తక్కువ.

చాలా తక్కువగా ఉన్న పాండవులు

తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని

చిత్తశుద్ధితో పోరాటం చేసి

విజేతలుగా నిలిచారు …

అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది……

ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద

ప్రేమ ఇటు తను నమ్ముకున్న

సిద్ధాంతాల మధ్య ఎలా

నలిగిపోయాడో, కొడుకుల వినాశనం

అంతా తెలుస్తున్నా వారి తప్పులని

ఆపలేకపోయాడు,

అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద

అంత ప్రేమని పెంచుకోక వారిని

క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం

అంత వరకూ వెళ్ళేది కాదేమో…

ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి…..

విద్య జీవితాంతం నేర్చుకోవటమే

ఉత్తమ బహుమతి…..

అర్జునుడు తన జీవితం ఆసాంతం

విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు.

ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధ

శాస్త్రం,

దైవ సంబంధమైన ఆయుధాల

వాడకం ఇంద్రుడు ద్వారా,

మహదేవుడి నుండి పాశుపతాస్త్రం,

యుధిష్టరుడు, కృష్ణుడి నుండి

మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి

దశలోనూ అభ్యసించటమే

అర్జునుడికి

ఓ ప్రత్యేక స్థానం దక్కింది,

నిత్యం నేర్చుకోవడం వలన

ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల

రూపంలో ఎదురవుతారు….. కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా….

స్త్రీలని ఆపదల నుండి కాపాడటం….

నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ

సంపన్నుల అత్యంత

బలవంతులు కూడా కానీ,

సభామందిరాన అవమానం

ఆపలేకపోవటంలో విఫలమయ్యారు.

కదా …

అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం….

పద్మవ్యూహం లోనికి ప్రవేశించటమే

కానీ బయటపడటం తెలియక

తనకున్న అర్ధ జ్ఞానమతో

అభిమన్యుడు వంటి మహావీరుడే

నేల రాలిపోయాడు..

ఏ పనిని అయిన పూర్తిగా

తెలుసుకున్నకే మొదలుపెట్టాలి,

అలా తెలుసుకోకపోతే ఆ పనిని

మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి

వస్తుంది…

స్త్రీని అవమానికి గురి చేయరాదు…. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులనీ వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది, స్త్రీలు దేవతలతో సమానం వాళ్ళని అవమాన పరచడం అనేది చాలా పెద్ద పాపం … !!

NEXT POST PRESSLINK:

http://tuesday.code.blog/2022/03/25/r1/

http://tuesday.design.blog/2022/03/25/r1/

http://tuesday.fitness.blog/2022/03/25/r1/

http://tuesday.law.blog/2022/03/25/r1/

http://tuesday.photo.blog/2022/03/25/r1/

http://wednesday.politics.blog/2022/03/25/r1/

http://wednesday2.home.blog/2022/03/25/r1/

https://phonemaranutru.blogspot.com

https://kalisivundaamr.blogspot.com

https://omsairamanu.blogspot.com